: విజయవాడ విలేఖరి పేరుతో ఢిల్లీకి చెందిన వ్యక్తి చోరీలు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో విలేఖరిగా పనిచేస్తున్నానంటూ చెప్పుకుంటున్న ఢిల్లీకి చెందిన రఘు అనే వ్యక్తి రైలులో చోరీలకు పాల్పడుతున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. ఆగి ఉన్న రైళ్లలో నిద్రపోతున్న మహిళల బ్యాగుల నుంచి అతడు బంగారం, విలువైన వస్తువులను చోరీ చేసినట్టు తెలిపారు. అతని నుంచి రూ.14 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రఘుపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదైనట్టు రైల్వే పోలీసులు వివరించారు.