: కేసీఆర్ నిరాహార దీక్ష మర్మాన్ని త్వరలో వెల్లడిస్తా: జైపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ నాడు చేసిన దీక్షపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తాజాగా విమర్శలు చేశారు. ఆయన నిరాహార దీక్ష ఎలా చేశారో తనకు తెలుసునని చెప్పారు. అసలాయన దీక్షను ఎందుకు విరమించారో ఇంతవరకు వివరణ ఇవ్వలేదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియాతో జైపాల్ మాట్లాడుతూ, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకే భయపడి కేసీఆర్ తిరిగి దీక్షను కొనసాగించారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష మర్మాన్ని త్వరలో తాను వెల్లడిస్తానన్నారు. అసత్యాలు, అబద్ధాలతో ఆయన అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని, రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై నడిపించానని, నాడు తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు.