: కుల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం దారుణం: హరీశ్ రావు


మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన కుల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తాము ఈ పథకాన్ని తీసుకొచ్చామని, కానీ ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. ఈ చర్యతో సీఎం చంద్రబాబు అసలు స్వరూపం బయటపడిందని మీడియా సమావేశంలో ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అన్న బాబు నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై టీటీడీపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు టీడీపీ హయాంలోనే అనుమతి ఉందని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ లు వదిలేసిన ప్రాజెక్టులను తాము పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News