: ఇక కల్తీ మసాలా... పాతబస్తీలో యూపీ వ్యాపారుల దందాపై పోలీసు దాడులు


కల్తీకి కాదేది అనర్హం. కల్తీ దందా ఎప్పుడు బయటపడ్డా, మన నోటి నుంచి వచ్చేది ఇదే మాట. తాజాగా మరోమారు భాగ్యనగరి వాసుల నోట ఈ మాట వినిపించింది. ఈసారి మసాలా దినుసులు కల్తీ అయ్యాయి. వ్యాపారం పేరిట హైదరాబాదుకు వచ్చిన ఉత్తరప్రదేశ్ వ్యాపారులు మసాలా దినుసుల కల్తీ దందాకు పాల్పడ్డారు. దాదాపు 9 నెలలుగా పాతబస్తీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై హైదరాబాదు పోలీసులు నేటి ఉదయం మూకుమ్మడి దాడులు చేశారు. దాడుల్లో భాగంగా కిరాణా షాపులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న వెయ్యికి పైగా కల్తీ మసాలా దినుసుల బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాకు సూత్రధారులుగా భావిస్తున్న 14 మంది వ్యాపారులతో పాటు కీలక నిందితుడు రాజేంద్రకుమార్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మసాలా దినుసులను ఆహారంలో తీసుకునే వారికి పక్షవాతంతో పాటు పలు ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయన్న అంశం హైదరాబాదీలను కలవరానికి గురి చేస్తోంది. ఈ దందాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News