: పారిస్ లో తనను తాను పేల్చేసుకున్న మహిళా సూసైడ్ బాంబర్
ఫ్రాన్స్ లోకి ఐఎస్ఐఎస్ కు చెందిన మహిళా ఆత్మహుతి దళమూ ప్రవేశించిందనడానికి ఈ ఉదయం సాక్ష్యం లభించింది. ఉగ్రదాడుల వెనకున్న మాస్టర్ మైండ్ కోసం సోదాలు జరుపుతున్న వేళ, తమకు తారసపడ్డ ఉగ్రవాదులతో పోలీసులు ఎన్ కౌంటర్ కు దిగిన సమయంలో, ఓ మహిళా సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకుందని ఫ్రాన్స్ భద్రతాదళాధికారి ఒకరు తెలిపారు. పోలీసు కాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని వివరించారు. కాగా, ఉగ్రవాదుల్లో మహిళలు కూడా ఉన్నారన్న అనుమానాలకు ఆధారాలు దొరకడంతో, జనావాసాలు, రద్దీ ప్రాంతాలు లక్ష్యంగా మరిన్ని దాడులు జరుగుతాయన్న భయాందోళనలు పెరిగాయి.