: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు ఓటర్లు నమోదు చేసుకోవచ్చు: గ్రేటర్ కమిషనర్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చని గ్రేటర్ కమిషనర్ బి.జనార్దనరెడ్డి చెప్పారు. బీసీ ఓటర్ల గుర్తింపు ఇప్పటికి 90 శాతం పూర్తయిందని తెలిపారు. గ్రేటర్ ఆఫీసుల్లో బీసీ ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈసీకి ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. కాగా, తప్పుల తడకగా ఉన్న డివిజన్ల పునర్ విభజనపై కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి కమిషనర్ ను కలసి మాట్లాడారు. సరిచేయకుంటే తాము హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.