: ఏటీపీ వరల్డ్ టూర్ లో జకోవిచ్ కు షాక్... ఫైనల్స్ లో ఫెదరర్ చేతిలో ఓటమి
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కు షాక్ తగిలింది. లండన్ లో జరుగుతున్న ఏటీపీ వరల్డ్ టూర్ పైనల్స్ లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. వరుస సెట్లలో 7-5, 6-2 తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో ఫెదరర్ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ లో ప్రవేశించాడు. గతేడాది ఆగస్టు 23న సిన్సినాటి ఫైనల్స్ తరువాత పెదరర్ చేతిలో జకోవిచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అయితే ఈ సీజన్ లో తనకు ఇది చాలా పెద్ద విజయమని, ఈ టోర్నమెంట్లో మరింత ముందుకు సాగేందుకు ఈ గెలుపు తోడ్పడుతుందని రోజర్ తెలిపాడు. కాగా ఈ గెలుపుతో జకోవిచ్ పై తన గెలుపోటముల రికార్డును 22-21గా ఫెదరర్ మెరుగుపరుచుకున్నాడు.