: ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా 1000 మంది భారత ఇమామ్ ల అతిపెద్ద ఫత్వా


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫత్వా జారీ అయింది. ఇండియాలో వివిధ మసీదులకు చెందిన 1000 మందికి పైగా ఇమామ్ లు, ముఫ్తీలు ఈ ఫత్వాపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ఇస్లాంకు వ్యతిరేకం ఎంతమాత్రమూ కాదని, మానవాళి నాశనాన్ని కోరుకుంటున్న ఉగ్రవాదానికి మాత్రమేనని ఇస్లామిక్ డిఫెన్స్ సైబర్ సెల్ హెడ్ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ అంజారియా వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం ఈ ఫత్వా ఆలోచన చేసిన ఆయన, షరియా చట్టాలంటూ, ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలను మత పెద్దలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. ఈ ఫత్వాపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్, అజ్మీర్ దర్గా ఇమామ్, మహారాష్ట్రలోని జమైతుల్ ఉలేమా, ఉలేమా కౌన్సిల్, జమైతే అహ్లీ హదీస్ తదితర ముస్లిం సంస్థలకు చెందిన 1070 మంది ప్రతినిధులు ఉన్నారు.

  • Loading...

More Telugu News