: నాడు 'కిస్ ఆఫ్ లవ్' అంటూ ప్రచారం చేసిన వ్యక్తి, నేడు సెక్స్ రాకెట్ లో పోలీసులకు చిక్కాడు!


"కిస్ ఆఫ్ లవ్" అంటూ కేరళ రాజధాని తిరువనంతపురం కేంద్రంగా బహిరంగ ముద్దుల ప్రచారం మొదలుపెట్టి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన రాహుల్ పశుపాలన్ అసలు నిజ స్వరూపం బట్టబయలైంది. రాహుల్ తన భార్య రేష్మీ నాయర్ తో కలసి ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని గుర్తించిన కేరళ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. గతంలో మోరల్ పోలీసింగ్ పేరిట ప్రేమికులపై దురుసుగా ప్రవర్తిస్తూ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, రాహుల్ "కిస్ ఆఫ్ లవ్" ప్రచారం చేయగా, యువత నుంచి మంచి స్పందన, అదే సమయంలో సంప్రదాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News