: రాజయ్య కోడలు కేసులో... భర్త అనిల్ కుమార్ ను విచారించనున్న పోలీసులు


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో ఆమె భర్త, కేసులో ప్రధాన నిందితుడు సిరిసిల్ల అనిల్ కుమార్ ను వరంగల్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ హన్మకొండ ఏసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని స్థానిక కోర్టు పరిశిలించింది. కొన్ని నిబంధనలతో అనుమతిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజయ్య, ఆయన భార్య మాధవి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై ఇవాళ రెండో అదనపు జిల్లా కోర్టు విచారించనుంది. కాగా, ప్రస్తుతం రాజయ్య సహా కుటుంబసభ్యులు, రెండో కోడలు సనా వరంగల్ సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News