: వెంకన్న దయ వల్లే వర్షాలు... తిరుచానూరులో గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం కొన్ని జిల్లాల్లో పెను నష్టాన్ని మిగల్చగా, గుంటూరు జిల్లా రైతులకు మాత్రం మేలే చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకన్న దయ వల్లే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నేటి ఉదయం సతీసమేతంగా చిత్తూరు జిల్లా బయలుదేరిన నరసింహన్ కొద్దిసేపటి క్రితం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉండాలని తాను అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News