: ప్రత్యేక విమానంలో బయలుదేరిన చంద్రబాబు... వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
వర్షం తాకిడికి విలవిల్లాడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కార్యరంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట బయలుదేరారు. వాతావరణం అనుకూలిస్తే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు. లేనిపక్షంలో రోడ్డు మార్గం మీదుగానైనా నెల్లూరు జిల్లా నాయుడుపేట వెళ్లేందుకు సిద్ధమయ్యే విజయవాడ నుంచి బయలుదేరారు. ఏరియల్ సర్వే అనంతరం చంద్రబాబు చిత్తూరు వెళ్లనున్నారు. చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల అంత్యక్రియలకు చంద్రబాబు హాజరవుతారు. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో అంతకుముందుగానే ఖరారైన సంగం డెయిరీ పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.