: పారిస్ లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్!
భయంకర ఉగ్రదాడి నుంచి ఇంకా తేరుకోని పారిస్ పై మరోమారు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారని తెలుస్తోంది. పారిస్ శివార్లలోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో, వెంటనే స్పందించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టినట్టు సమాచారం. ఈ ఘటన నేటి ఉదయం 9 గంటల తరువాత (భారత కాలమానం ప్రకారం) జరుగగా, ఇంకా పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోందని తెలుస్తోంది. పారిస్ పోలీసులతో పాటు ఉగ్రవాదులు తుపాకులు పేల్చుతున్న శబ్దాలు తాము విన్నామని పలువురు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ఉంచుతున్నారు. ఈ ఘటనలపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.