: రూ. 2,800 కోట్లతో ఏపీకి వెళ్లిన చైనా సంస్థ


సుమారు రూ. 2,800 కోట్ల పెట్టుబడితో చైనాకు చెందిన 'త్రినా సోలార్' విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలో సౌర శక్తి పరికరాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో త్రినా ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, త్రినా సోలార్ వైస్ ప్రెసిడెంట్ చెన్ షోవు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన కంపెనీలకు స్నేహపూర్వకంగా ఉంటుందని తెలిపారు. కాగా, త్రినా సోలార్ సంస్థ క్రిస్టలైన్ సిలికాన్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ను ఏపీలో తయారు చేయనుంది. దీంతో పాటు సోలార్ సెల్స్, వేఫర్స్, సోలార్ మాడ్యూల్స్ తదితరాలను అభివృద్ధి చేస్తోంది.

  • Loading...

More Telugu News