: హైవేపై పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్... ఎస్సై సహా పోలీసులకు గాయాలు
జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, ప్రమాదాలకు గురయ్యే వాహనదారులను హుటాహుటీన ఆసుపత్రులకు తరలించే బాధ్యతల్లో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనమే ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం జిల్లా వెన్ పాడు టోల్ గేటు వద్ద నేటి ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ప్రైవేట్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనంలోని ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని టోల్ గేటు సిబ్బంది హుటాహుటిన నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.