: చిత్తూరులో బంద్... భారీగా మోహరించిన పోలీసు బలగాలు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హత్య నేపథ్యంలో కాపునాడు ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు నగరంలో బంద్ కొనసాగుతోంది. నిన్న గుర్తు తెలియని దుండగుల దాడిలో కఠారి దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణం నేపథ్యంలో కాపునాడు రాష్ట్ర శాఖ చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. నేటి ఉదయం నుంచే పట్టణంలో బంద్ ప్రభావం మొదలైంది. నగరంలోని ఒక్క దుకాణం కూడా తెరచుకోలేదు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. భారీగా బలగాలను మోహరించిన జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు.