: అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి వీల్లేదు!: కేరళ విద్యా శాఖ మంత్రి


పాఠశాలలు, కళాశాలల్లో అబ్బాయిలు అమ్మాయిలు, ఒకే బెంచ్ పై కూర్చోవడానికి వీల్లేదంటూ కేరళ విద్యాశాఖ మంత్రి అబ్దూ రట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఇలా వీరు ఒకే బెంచిపై కూర్చోవడాన్ని వ్యక్తిగతంగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. అయితే, ఇక్కడ మన నిర్దేశాలు పనికిరావు. ఆయా కాలేజీలదే తుది నిర్ణయం' అన్నారాయన. కాగా, గత అక్టోబర్ లో కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఫరూఖ్ కాలేజీలో తొమ్మిది మంది బీఏ విద్యార్థులు ఒకే బెంచ్ పై కూర్చున్నారన్న కారణంగా వారికి కాలేజీ యాజమాన్యం నోటీసులిచ్చింది. అయితే, అందులో ఒక విద్యార్థి కళాశాల తీరును ప్రశ్నించడంతో అతన్ని సస్పెండ్ చేశారు. దీంతో విద్యార్థి యూనియన్లు రంగంలోకి దిగాయి. ఈ వివాదం హైకోర్టుకు కూడా చేరింది. విద్యార్థిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరిచిపోకముందే, విద్యా మంత్రి అబ్దూ రట్ ఈ వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News