: టీ కాంగ్రెస్, టీడీపీ నాయకుల వల్ల సంక్రమించిన దరిద్రాన్ని పోగొడతాం: కేసీఆర్
58 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాలను... తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకుల వల్ల మనకు సంక్రమించినటువంటి దరిద్రాన్ని పోగొట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ సర్కార్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాయని ఆయన మండిపడ్డారు. కేవలం 16 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించామని, తెలంగాణ అవసరాలన్నింటినీ క్రమంగా తీరుస్తున్నామని అన్నారు.