: హత్యాయత్నం కేసులో సినీ నటుడు వినోద్ కుమార్ కు రిమాండ్
ప్రముఖ సినీ నటుడు వినోద్ కుమార్ కు కర్ణాటక స్థానిక కోర్టు రిమాండ్ విధించింది. తన పర్సనల్ మేనేజర్ పై హత్యాయత్నం కేసులో ఆయన్ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. తన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానంతో తన మేనేజర్ సచ్చిదానందపై వినోద్ హత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో మేనేజర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.