: జీహాద్ అంటే అమాయకుల ప్రాణాలు తీయడం కాదు: ‘జమైతే ఉలేమా’ స్కాలర్
‘ఇస్లాం మతానికి ఉగ్రవాదుల చర్యలు సవాల్ గా మారాయి’ అని జమైతే ఉలేమా అల్ హిందూ సంస్థ స్కాలర్ మౌలానా మహ్మద్ మదానీ అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, జాతివివక్ష, నరమేధానికి వ్యతిరేకంగా ముస్లింలు జిహాద్ ప్రకటించాల్సిందేనన్నారు. ముస్లింలంతా ఏకమై ఉగ్రవాద నిరోధానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలన్నారు. అమాయాకుల ప్రాణాలు తీయడం జీహాద్ కాదని అన్నారు. ఉగ్రవాదంపై జిహాద్ ప్రకటించడం ప్రతి ముస్లిం దేశానికి ఉన్న కనీస బాధ్యత అని, ఆయా దేశాలు ఈ విషయంలో కలిసి ముందడుగు వేయాలని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ర్యాలీలు ఢిల్లీ, హైదరాబాద్, ముంబయితో పాటు మరో 65 నగరాల్లో ఉంటాయని మౌలానా పేర్కొన్నారు.