: రూ.450 తగ్గి... నాలుగు నెలల కనిష్ఠానికి చేరిన పుత్తడి ధర

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ప్రధానంగా పసిడి నాలుగు నెలల కనిష్ఠానికి చేరింది. ఏకంగా ఇవాళ రూ.450 తగ్గింది. దాంతో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.25,700కి చేరింది. అటు వెండి ధర కూడా తగ్గింది. ఈ రోజు రూ.500 తగ్గడంతో కేజీ ధర రూ.34,100కు చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు, రీటైలర్లు కొనుగోళ్లు చేయకపోవడం, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఈ రెండు లోహాల ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.