: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఆర్మీ కల్నల్ వీరమరణం!
అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఆర్మీ కల్నల్ అమరుడయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదుల బృందమే భద్రతాదళాలతో ఎదురుకాల్పులకు దిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. జమ్మూకాశ్మీర్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని మణిగావ్ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు అక్కడికి వెళ్లాయి. వీరిని చూసిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఆర్మీ కల్నల్ కు బుల్లెట్ గాయాలవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, గతవారం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు భద్రతా దళాలను ఎదుర్కొన్న ఉగ్రవాదులలో కొందరు వీరిలో ఉన్నట్లు సమాచారం.