: మోసాలకు పాల్పడ్డ ‘ఫ్లిప్ కార్ట్’ వెండర్ పై కేసు నమోదు!


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ వెండర్ పై బెంగళూరు లోని కామాక్షిపాళ్యా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. మోసాలకు పాల్పడుతూ తమ సంస్థకు సుమారు రూ.1.5 లక్షల వరకు నష్టం కలిగించినట్లు ఆ ఫిర్యాదులో ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... నంది ఎలక్ట్రానిక్స్ షాపు యజమాని రమేష్ కుమార్ ఫ్లిప్ కార్ట్ తరపున వెండర్ కూడా వ్యవహరిస్తున్నాడు. తప్పుడు అడ్రస్ లతో ఆయా వస్తువులు కావాలంటూ రమేష్ ఆర్డరు చేసేవాడు. ఆర్డరు మేరకు ఆయా వస్తువులను రమేష్ కు సంస్థ పంపించేది. అలా వచ్చిన పార్శిళ్ళను ఓపెన్ చేసి, వాటిలో నాసిరకం వస్తువులను ప్యాక్ చేసి డెలివరీ బాయ్స్ కు ఇచ్చేవాడు. తప్పుడు అడ్రస్ ల కారణంగా అవి డెలివరీ కాలేదంటూ బాయ్స్ వాటిని తిరిగి తీసుకొచ్చేవారు. అల వచ్చిన పార్శిళ్లను తిరిగి సంస్థకు పంపించేవాడు. తాను ఒరిజినల్ ఐటెమ్స్ ప్యాక్ చేసి పంపించానని, డెలివరి బాయ్స్ అందులో వస్తువులను మార్చారని పై అధికారులకు ఫిర్యాదు చేసేవాడు. డెలివరీ బాయ్స్ కొన్ని వస్తువులను దొంగిలిస్తున్నారని కూడా ఫిర్యాదు చేస్తుండేవాడు. చివరకు, ఈ విషయాలన్ని బయటపడటంతో ఫ్లిప్ కార్ట్ సంస్థ అతనిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News