: హత్యకు నిరసనగా టీడీపీ శ్రేణుల రాస్తారోకో
చిత్తూరు మేయర్ అనురాధను అత్యంత పాశవికంగా హత్య చేయడం పట్ల టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. హత్యకు నిరసనగా రాస్తారోకో చేపట్టాయి. జిల్లాలోని పూతలపట్టు-నాయుడిపేట జాతీయ రహదారిపై పి.కొత్తకోట వద్ద టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. ఈ క్రమంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, ప్రయాణికులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, హత్యకు పాల్పడ్డవారిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. హత్యా స్థలంలో రైఫిల్, 3.2 వెపన్, కత్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.