: గీత చెప్పిందే నిజం... బీహార్ మహతో తండ్రి కాదని తేల్చిన డీఎన్ఏ
భారత పుత్రికగా గుర్తింపు తెచ్చుకున్న మూగ, బధిర బాలిక గీత చెప్పిందే నిజమైంది. బీహార్ కు చెందిన మహతో గీతకు తండ్రికాదని తేలిపోయింది. మహతో, గీతల డీఎన్ఏను పరీక్షించిన వైద్య వర్గాలు ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపాయి. పాకిస్థాన్ లో ఉన్నప్పుడు మహతో కుటుంబం ఫోటోను చూసి వారే తన తల్లిదండ్రులని వెల్లడించిన గీత, ఆపై గత నెల 27న ఢిల్లీకి వచ్చిన తరువాత, మీడియా సమావేశంలో వారు తన వారు కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమె తమ కుమార్తేనని వచ్చిన అందరి డీఎన్ఏలనూ పరీక్షించేందుకు విదేశాంగ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.