: అశోక్ సింఘాల్ మృతిపట్ల మోదీ స్పందన


వీహెచ్ పీ అధినేత అశోక్ సింఘాల్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఆయన మృతి దేశానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి సేవచేసేందుకు తన జీవితాన్ని ధారపోశారని, ఆయనొక వ్యవస్థ అని కొనియాడారు. సింఘాల్ ఎల్లప్పుడూ తనకు మార్గదర్శనం చేస్తుండేవారని చెప్పారు. ఆయన వ్యక్తి కాదని... శక్తి అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సింఘాల్ స్పూర్తిగా నిలుస్తారని ట్విట్టర్ లో ప్రధాని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News