: అమెరికా ముందు జాగ్రత్త ... పారిస్ వెళ్లవద్దని సైనికులు, ఇతర సిబ్బందికి ఆదేశం
పారిస్ దాడుల నేపథ్యంలో తన సైన్యం, ఇతర సిబ్బంది రక్షణ కోసం అగ్రరాజ్యం అమెరికా ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది. విధి నిర్వహణకు సంబంధం లేని పనులపై సైనికులు, ఇతర సిబ్బంది పారిస్ కు వెళ్లవద్దని ఆదేశించింది. అమెరికా సైనికులు, రక్షణ శాఖ సివిల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పారిస్ తో పాటు ఆ నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో అనధికారికంగా పర్యటించవద్దని పెంటగాన్ అధికార ప్రతినిధి కెప్టెన్ జెఫ్ డేవిస్ తెలిపారు. అయితే జనరల్ ఆఫీసర్ అనుమతితో పారిస్ బయటి ప్రాంతాల్లో పర్యటించవచ్చని పేర్కొన్నారు. గతవారంలో పారిస్ లో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.