: ఉగ్రదాడి వల్లే రష్యా విమానం కూలిందని ధ్రువీకరణ
రష్యాకు చెందిన ఏ321 ఎయిర్ బస్ విమానం అక్టోబర్ 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 224 మంది చనిపోయారు. అయితే విమానాన్ని ఉగ్రవాదులే కూల్చారని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ధ్రువీకరించారు. బాంబు దాడితో విమానాన్ని నేలకూల్చారని ఆయన వెల్లడించారు. విమాన శకలాల్ని పరీక్షించగా అందులో పేలుడు పదార్థాల అవశేషాలు లభ్యమయ్యాయని ఆయన తెలిపారు. ఇదే విషయంపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్ అలెగ్జాండర్ బోర్న్తికోవ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఆ విమానాన్ని కూల్చేందుకు 1.5 కేజీల బరువున్న అత్యంత ఆధునిక పేలుడు పదార్థాల్ని ఉపయోగించారని తెలిపారు.