: అనురాధ మృతిపై స్పందించిన లోకేశ్
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేశ్ స్పందించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని ఆయన సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమెపై దాడి అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన లోకేష్, నిందితులు ఎంతటి వారైనా చట్టాలు వదిలిపెట్టబోవని హెచ్చరించారు. లొంగిపోయిన నిందితుల నుంచి దాడికి సూత్రధారులు ఎవరన్న విషయాన్ని పోలీసులు తేలుస్తారని అన్న లోకేష్, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.