: కఠారి మోహన్ మేనల్లుడు చింటూనే హత్యకు పాల్పడ్డాడా?


చిత్తూరు నగర మేయర్ అనురాధ హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. మరోవైపు, ఆమెను ఎవరు హత్య చేశారన్న విషయంలో పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అనురాధ భర్త కఠారి మోహన్ కు స్థానిక వైకాపా నేత సీకే బాబుకు గత అనేక సంవత్సరాలుగా వైరం ఉంది. ఈ క్రమంలో హత్య జరిగిన వెంటనే అందరి దృష్టి సీకే బాబుపైకి మళ్లింది. అయితే, ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మోహన్ మేనల్లుడు చింటూనే ఈ హత్యకు పాల్పడ్డాడని, మోహన్ అనుచరులు భావిస్తున్నారు. ఒకప్పుడు మోహన్ కు ముఖ్య అనుచరుడిగా చింటూ ఉండేవాడు. అయితే, ఏదో భూమి వ్యవహారానికి సంబంధించి మోహన్ కు చింటూ దూరమయ్యాడని సమాచారం. ఈ క్రమంలో, ఘటన జరిగిన వెంటనే మోహన్ అనుచరులు చిత్తూరులో ప్రతి దాడులకు దిగారు. చింటూకు చెందిన ఆఫీసును పెట్రోలు పోసి తగలబెట్టారు. అంతేకాకుండా, ఆఫీసు ముందు ఉన్న రెండు బైక్ లు, ఒక జీపును దగ్ధం చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News