: వడ్డీ దందా కేసులో కరీంనగర్ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ తిరస్కరణ
వడ్డీ దందా కేసులో ఇటీవల అరెస్టైన కరీంనగర్ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి జిల్లా కోర్టులో నిరాశ ఎదురైంది. బెయిల్ కోరుతూ అతను వేసిన పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది. అయితే బెయిల్ మంజూరు చేస్తే అది కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు ఏఎస్ఐకు బెయిల్ తిరస్కరించింది. కాగా, ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే.