: మీకు ఆసక్తిని కలిగించే సరికొత్త, ఫన్నీ, యూజ్ ఫుల్ యాప్స్!


మార్కెట్లో ఎన్నో వేల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. డేటింగ్ యాప్స్ నుంచి నిత్యావసరాలు, సినిమా టికెట్ల బుకింగ్ నుంచి సామాజిక మాధ్యమాల వరకూ వరకూ మునివేలి కొనల తాకిడితో చేతుల్లోకి వాలిపోతున్నాయి. ఇలాంటి వేల కొద్దీ యాప్స్ నుంచి మనకు ఉపయోగపడుతూనే ఆహ్లాదాన్ని కలిగించే యాప్స్ ను ఎంచుకోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చి దూసుకెళ్తున్న ఫన్నీ, యూజ్ ఫుల్ యాప్స్ వివరాలివి. రన్ పీ: ఇదో ఆసక్తికరమైన యాప్. ఇది మీరు ఓ సినిమాను చూసేటప్పుడు మూత్ర విసర్జనకు ఎప్పుడు వెళ్లాలన్న విషయాన్ని కచ్ఛితంగా చెబుతుందట. ఆ చిత్రంలో బోర్ కొట్టే ఒకటి నుంచి నాలుగు సన్నివేశాలను ఎంపికచేసి, అవి వచ్చే సమయానికి అలర్ట్ చేస్తుంది. ఇక ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చినా, మిస్ అయిన భాగాన్ని చూపుతుంది. ఒకవేళ సినిమా ప్రారంభం మిస్ అయితే, సినాప్సిస్ ఇస్తుంది. ఈ యాప్ లో తాజాగా విడుదలయ్యే, పాత సినిమాల సమాచారం మొత్తం నిక్షిప్తం చేసినట్టు యాప్ తయారీదారులు వివరిస్తున్నారు. హనీ ఇట్స్ మీ: బ్రహ్మచారుల్లో ఈ యాప్ ఇప్పుడు హాట్ సెలక్షన్. గర్ల్ ఫ్రెండ్స్ లేని వారి స్మార్ట్ ఫోన్లలో తెగ చక్కర్లు కొడుతోంది. సౌత్ కొరియాకు చెందిన 'నాబిక్స్' తయారు చేసిన యాప్ లో వర్చ్యువల్ గర్ల్ ఫ్రెండ్ పలకరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 'మినా' అనే పేరున్న ఈ అందమైన యువతితో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ప్రేమ చూపించొచ్చు. ఇంకేమైనా అడగొచ్చు. మీతో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తుంది 'మినా'. హోల్డ్ ఆన్: మీ కాన్సట్రేషన్ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి ఉపయోగపడే యాప్ ఇది. ఇది ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పరీక్షిస్తూ, మీ పర్సనల్ రికార్డు సమయాన్ని స్టోర్ చేస్తుంది. క్రై ట్రాన్స్ లేటర్: తల్లిదండ్రులకు ఉపయోగపడే యాప్ ఇది. మీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో, చిన్నారికి ఏం కావాలో చెప్పేస్తుందట. ఏడుపులో రకాలను బట్టి అనలైజ్ చేసి సొల్యూషన్ ను సిఫార్సు చేస్తుంది. వాడికి ఆకలిగా ఉందా? నిద్ర వస్తోందా? బాధ కలిగిందా? ఒత్తిడిలో ఉన్నాడా? ఏమీ తోచక ఏడుస్తున్నాడా? అన్నది టక్కున చెప్పే ఈ యాప్ అందరికీ ఏదో ఒక దశలో ఉపయోగపడుతుందేమో! ఎయిర్ పీఎన్పీ: మీరు ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే. మీకు దగ్గర్లో ఉన్న రెస్ట్ రూంను ఈ యాప్ చూపిస్తుంటుంది. నగరం మధ్యలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఓ పెద్ద ఈవెంటులో ఉన్నా మీకు అత్యవసరాలు తీర్చుకోవాల్సిన వేళ ఎటు వెళితే, దగ్గర్లో టాయ్ లెట్, బాత్ రూం తదితరాలు ఉన్నాయో ఇట్టే చెప్పేస్తుంది. కొత్త నగరాలకు వెళ్లే వారికి ఈ యాప్ భలే ఉపయోగపడుతోందట.

  • Loading...

More Telugu News