: ఐఎస్ఐఎస్ నెట్ వర్క్ పై హ్యాకర్ల యుద్ధం... వద్దని మొత్తుకుంటున్న అగ్రరాజ్యాలు!


ఫ్రాన్స్ పై మారణకాండ అనంతరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడులు జరుగుతుండగా, గుర్తు తెలియని ఓ హ్యాకింగ్ బృందం వారిపై యుద్ధం ప్రకటించింది. వారి అన్ని ఇంటర్నెట్ కనెక్షన్లు, వెబ్ సైట్లను హ్యాకింగ్ చేస్తున్నట్టు ఓ వీడియోను వెలువరించింది. ఈ తరహా చర్యలు తగవని ఇప్పుడు అగ్రరాజ్యాలు మొత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉగ్రవాదుల నెట్ వర్క్ ను హ్యాక్ చేస్తే, వారి చర్యలపై సమాచారం కరవవుతుందని ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అధికారి ఓలివర్ లౌరెల్లీ హెచ్చరించారు. జీహాదీ సంస్థలు చేస్తున్న ప్రచారం బయటి ప్రపంచానికి తెలియకుండా చేసే ఈ తరహా చర్యలు ఆపివేయాలని సూచిస్తున్నారు. కాగా, "మా ఫ్రాన్స్ పై నవంబర్ 13 రాత్రి 10 గంటల సమయంలో పలు ఉగ్రదాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా అతిపెద్ద సైబర్ ఆపరేషన్ మొదలు పెడుతున్నాం. మా సైబర్ దాడులను కాచుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇక యుద్ధమే" అంటూ గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన వీడియోను ఇప్పటికే 13 లక్షల మందికి పైగా తిలకించారు.

  • Loading...

More Telugu News