: గంగిరెడ్డికి ఖైదీ నంబర్ కేటాయింపు
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కడప సెంట్రల్ జైల్లో హైసెక్యూరిటీ బ్లాక్ లో ఉంచారు. ఈ క్రమంలో ఆయనకు ఇవాళ ఖైదీ నంబర్ 6154ను కేటాయించారు. గంగిరెడ్డిపై జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గంగిరెడ్డి అరెస్ట్ తో ఆయా ప్రాంతాల పోలీసులు పీటీ వారెంట్లకు సిద్ధమయ్యారు.