: ముప్పు తప్పలేదు... పొంచివున్న మరో వాయు'గండం'!


కుదిపేస్తున్న భారీ వర్షాల నుంచి నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కాస్తంత తెరిపిచ్చినప్పటికీ, అది తాత్కాలికమేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చెన్నై సమీపంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీనికితోడు ఆకాశంలో 5 కిలోమీటర్ల పైన ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, వీటి ప్రభావంతో మరో రెండు మూడు రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు, ఉత్తర తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కాగా, జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదన్న ఆంక్షలు మరో నాలుగు రోజులు అమల్లో ఉంటాయని తమిళ సర్కారు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తీరం దాటవచ్చని అధికారులు వివరించారు. మరోవైపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద పరిస్థితిపై కలెక్టర్లు, అధికారులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన సామాగ్రితో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించాయి.

  • Loading...

More Telugu News