: చిత్తూరు మేయర్ హత్య కేసులో ఇద్దరు వ్యక్తుల లొంగుబాటు


చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో ఇద్దరు దుండగులు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ మధ్యాహ్నం మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన తరువాత తామే కాల్పులు జరిపామంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసుల ముందుకు వచ్చారు. అయితే వారి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు సంఘటన జరిగిన స్థలానికి స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్ కుమార్, క్రైమ్ బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. దండగులు తప్పించుకోకుండా ఉండేందుకు జిల్లాలో చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News