: మేయర్ అనురాధను పాయింట్ బ్లాంక్ లో కాల్చారు
చిత్తూరు మేయర్ అనురాధను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మేయర్ కార్యాలయంలోనే జరిగిన ఈ దాడిలో... ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. దుండగులు కర్ణాటక వాహనంలో రావడంతో, వారు ఆ రాష్ట్రానికి చెందిన కిరాయి హంతకులుగా భావిస్తున్నారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టు సమాచారం. దాడి జరిపిన తర్వాత దుండగులు గేటు దూకి పారిపోయారు. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ ఆమె భర్త మోహన్ ను తొలుత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.