: ఏపీలో వర్ష బాధిత మృతులకు పరిహారం ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో ఐదుగురు చనిపోగా, ఇద్దరు గల్లంతయ్యారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఉదయం కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హుద్ హుద్ తుపాను బాధితులకు ఇచ్చినట్టు బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అంతేగాక వరదలో చిక్కున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కడప చేరుకున్నాయి. చెరువులు, కాల్వలకు పడిన గండ్లను ఇసుక బస్తాలతో పూడ్చాలని సూచించారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించారు.