: ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఫ్రాన్స్... తెల్లారకుండానే రఖాపై విరుచుకుపడ్డ యుద్ధవిమానాలు


పారిస్ పై ఉగ్రదాడిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న ఫ్రాన్స్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల రాజధానిగా పేరున్న రఖా నగరంపై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ తెల్లవారుఝామున అరబ్ ప్రాంతాల్లోని తమ సైనిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను పంపి బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఓ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని, ఉగ్రవాదులు దాగున్న స్థావరాన్ని పేల్చివేసినట్టు ఫ్రెంచ్ సైన్యాధికారి ఒకరు తెలిపారు. దాడులను కొనసాగిస్తామని ఆయన అన్నారు. సిరియాకు వెళ్లిన ఫ్రెంచ్ సైన్యం 'దేయిష్' పేరిట నడుస్తున్న ఉగ్ర సంస్థను నిర్వీర్యం చేసే పనిలో ఉందని పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ వైమానిక దాడుల్లో అమాయకులు బలవుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News