: చంద్రబాబుకు, కేసీఆర్ కు ఉన్న తేడా అదే: సురవరం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనీసం పొలిటికల్ కల్చర్ అయినా ఉందని... టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అది కూడా లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. తన రాజకీయ సహచరులు, మంత్రులతో చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తారని, చర్చలు జరుపుతున్న భావన కల్పిస్తారని అన్నారు. అదే కేసీఆర్ విషయానికి వస్తే కనీసం ఆ పని కూడా చేయరని చెప్పారు. ఈ కారణం వల్లే పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు కేసీఆర్ దూరం అవుతున్నారని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఉన్న తేడా ఇదేనని చెప్పారు. ప్రధాని మోదీ తరహాలోనే కేసీఆర్ కూడా తనకు తోచిన విధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. అయితే, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ ప్రజల బలహీనతలపై దెబ్బకొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.