: ఇదేనా మేరా భారత్ మహాన్? మీరూ చూడండి!


మేరా భారత్ మహాన్... ఈ మాట చెప్పడానికి ప్రతి భారతీయుడూ గర్వపడతాడు. కానీ చెప్పే విధానంలో తేడా వస్తే... ఇక్కడదే జరిగింది. సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహలానీ చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయనకున్న అపారమైన భక్తి ప్రపత్తులను, విశ్వాసాన్ని చాటుకునేందుకు 'మోదీ కాకా ...' అంటూ ఓ గీతాన్ని తెరకెక్కించారు. అంతటితో ఆగితే సరిపోయేది. 'మేరా భారత్ మహాన్' అంటూ, దుబాయ్ ఎక్స్ ప్రెస్ వే, నాసా స్పేస్ సెంటర్, టూర్ డీ ఫ్రాన్స్, మాస్కో నేషనల్ బిజినెస్ సెంటర్ వంటి వాటిని చూపించారు. ఆయన యోగా చేస్తూ కూర్చున్న చిత్రాన్ని తీసుకుని హిమాలయాల మధ్య యోగిలా మార్ఫింగ్ చేసి చూపాడు. పలువురు దేశాధినేతలతో మోదీ ఉన్న చిత్రాలు, వీడియోలను వాడుతూ పేలవమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కించిన ఈ గీతం, నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీన్నో 'సీ' గ్రేడ్ వీడియోగా పేర్కొంటున్నారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'ప్రేమ్ రతన్ థన్ పాయో' ప్రదర్శిస్తున్న థియేటర్లలో విశ్రాంతి సమయంలో ఈ పాట ప్రదర్శితమవుతోంది. దీన్ని చూస్తే ప్రదాని కూడా ముక్కున వేలేసుకునేలా ఉందని, ఆయనకు అంకితమిచ్చిన ఈ వీడియో 'మేకిన్ ఇండియా' ప్రచారానికే సిగ్గు చేటని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆ పాట వీడియోను మీరూ చూడండి!

  • Loading...

More Telugu News