: అమెరికాకు క్యూ కట్టిన భారత విద్యార్థులు... ఏడాదిలో 30 శాతం వృద్ధితో రికార్డు
విద్యాభ్యాసం కోసం అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అయితే నిరుడు ఈ వృద్ధి రికార్డు స్థాయిలో నమోదైంది. అమెరికా బాట పడుతున్న వివిధ దేశాల విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే గతేడాది ఆ దేశం చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యంత ఎక్కువగా ఉంది. అంతేకాక 1954-55 విద్యా సంవత్సరం నాటి నుంచి చూస్తే, నిరుడు ఈ వృద్ధి రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ వృద్ధి 29.4 శాతంగా నమోదైందని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్చేంజి విడుదల చేసిన ‘ఓపెన్ డోర్స్ రిపోర్ట్’ వెల్లడించింది. 2000-01లో కూడా మంచి వృద్ధి (29.1) నమోదైనా, నిరుటి వృద్ధి దానిని అధిగమించింది. 2013-14లో 1.02 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళితే, నిరుడు ఈ సంఖ్య ఒకేసారి 30 వేలు పెరగడం గమనార్హం.