: హత్యాయత్నం కేసులో ప్రముఖ నటుడు వినోద్ కుమార్ అరెస్ట్


తన పర్సనల్ మేనేజర్ పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రముఖ నటుడు వినోద్ కుమార్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, సచ్చిదానంద అనే వ్యక్తి వినోద్ కుమార్ వద్ద మేనేజర్ గా పనిచేస్తూ, ఆయన ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. తన ఫైనాన్స్ మ్యాటర్స్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానంతో వినోద్ కుమార్, సచ్చిదానందల మధ్య గొడవలు, వాగ్వాదం జరిగాయి. ఈ నేపథ్యంలోనే సచ్చిదానందపై హత్యాయత్నం జరిగింది. జరిగిన విషయాన్ని సచ్చిదానంద పుత్తూరు సమీపంలోని సంప్య పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు వినోద్ కుమార్ తన మేనేజర్ పై దాడికి ప్రయత్నించాడన్నది వాస్తవమని తేల్చారు. దీంతో దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని తన స్వగ్రామం ఈశ్వర మంగలలో ఉన్న వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, వినోద్ కుమార్ 'మౌనపోరాటం', 'మామగారు', 'సీతారత్నం గారి అబ్బాయి' తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

  • Loading...

More Telugu News