: దక్షిణాఫ్రికాలో భారత సంతతి క్రికెటర్ నరబలి... ప్రాణ స్నేహితుడే చంపేశాడట!


భారత సంతతికి చెందిన ఓ మానసిక వికలాంగ క్రికెటర్ దక్షిణాఫ్రికాలో నరబలికి గురయ్యాడు. ప్రాణ స్నేహితుడే అతడిని అడవిలోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా కత్తితో అతడి తలను నరికేశారట. ఈ కేసులో బాధితుడి స్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే... నవాజ్ ఖాన్ (23) అనే భారత సంతతి యువకుడు వికలాంగుడైనా క్రికెట్ లో రాణిస్తున్నాడు. తనదైన శైలిలో రాణిస్తున్న నవాజ్ ఖాన్ 2013 ఏడాదికి సంబంధించి ‘వికలాంగ క్రికెటర్ ఆఫ్ ఇయర్’గా అవార్డు కూడా అందుకున్నాడు. సదరు అవార్డును తన అభిమాన క్రికెటర్ హషీమ్ ఆమ్లా చేతుల మీదుగా అందుకున్న నవాజ్ ఖాన్ తెగ సంబరపడిపోయేవాడట. ఇదిలా ఉంటే, నవాజ్ ఖాన్ కు తండోవాఖే డుమా(21) అనే ప్రాణ స్నేహితుడున్నాడు. నాటు వైద్యం చేస్తుండే డుమాకు సమస్యల నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాలని ఓ భూత వైద్యుడు చెప్పాడు. ఈ మేరకు డుమా పక్కాగా పథకం రచించుకున్నాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి డుమా, నవాజ్ ఖాన్ ను తన ఇంటికి సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్కడ కత్తితో దాడి చేసి నవాజ్ ఖాన్ ను హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డుమాను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా తాను చేసిన ఘాతుకాన్ని ఒప్పుకోవడంతో పాటు ఘటనా స్థలాన్ని డుమా చూపించాడు.

  • Loading...

More Telugu News