: పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్ ప్రెస్ బోగీ... ప్రయాణికులంతా సురక్షితం


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు రాయలసీమను చుట్టుముట్టేశాయి. ఒక్క కర్నూలు జిల్లా మినహా కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం కారణంగా గౌహతి ఎక్స్ ప్రెస్ కు నిన్న రాత్రి పెను ప్రమాదమే తప్పింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం మఠంపల్లె వద్ద గౌహతి ఎక్స్ ప్రెస్ కు చెందిన ఓ బోగీ పట్టాలు తప్పింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా చెన్నై- ముంబై మధ్య పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News