: ‘సెంచరీ’ దాటిన టమోటా ధర!


ఇప్పటికే కందిపప్పు ‘డబుల్ సెంచరీ’ కొట్టి సగటు జీవిని ఇబ్బందుల పాల్జేస్తోంటే, తాజాగా టమోటా వంతు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో టమోటా ధర ‘సెంచరీ’ దాటేసింది. తెలంగాణలో కాస్తంత తక్కువగా కిలో టమోటా ధర రూ.80కి చేరగా, ఏపీలో ఈ ధర ఏకంగా వంద కంటే ఎక్కువగా పలుకుతోంది. నేరుగా రైతులే విక్రయాలు జరిపే రైతు బజార్లలోనే ఏపీలో కిలో టమోటా రూ.92 పలికింది. ఇక రిటైల్ మార్కెట్ లో ఈ ధర రూ.105 నుంచి రూ.110 దాకా పలికింది. వర్షాభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే టమోటా ధర భారీగా పెరిగిపోయిందని తెలుస్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్న టమోటా ధరను నియంత్రించేందుకు ఇరు రాష్ట్రాల్లో నేడు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హోల్ సేల్ రేట్లకే టమోటాను పంపిణీ చేయించే దిశగా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News