: అమెరికాతో పాటు ఇతర దేశాలనూ వదలం: ఐఎస్ తాజా హెచ్చరికలు
రాబోయే రోజుల్లో అమెరికాపైనా, ఇతరదేశాలపైనా దాడులకు పాల్పడతామని ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది. తమపై జరుగుతున్న దాడులకు సహకరిస్తున్న దేశాలకు ఫ్రాన్స్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తూ ఐఎస్ఐఎస్ ఒక వీడియోను విడుదల చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉపయోగించే వెబ్‌సైట్‌లో సోమవారం ఈ వీడియో కనపడింది. పారిస్‌లో 129 మందిని హతమార్చిన దాడులకు సంబంధించిన వార్తలతో ఈ వీడియోను ప్రారంభించారు. సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాల్లో అగ్రరాజ్యాలు జరుపుతున్న వైమానిక దాడులను 'క్రూసెడర్ క్యాంపెయిన్'గా వీడియోలో ఉన్న వ్యక్తి అభివర్ణించాడు. తన పేరు అల్జెరియన్ అల్ గరీబ్‌గా ఆ వీడియోలో అతను చెప్పుకున్నాడు.