: ‘డిగ్గీ’ రాజా కల్లు తాగిన వేళ!


‘డిగ్గీ’ రాజా కల్లు తాగారు. అవును, ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన గౌడ సమ్మేళనంలో ఆయన కల్లు తాగారు. తాడు, మోకును మెడలో వేసుకున్న ‘డిగ్గీ’ తమ పార్టీకే ఓట్లు వేయాలని గౌడ కులస్తులను కోరారు. సోమవారం సాయంత్రం వరంగల్ డీసీసీ కార్యాలయంలో జరిగిన గౌడ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. అప్పటికే గౌడ కులస్తులు కల్లు లొట్టిలతో అక్కడికి చేరుకున్నారు. ఆ సమ్మేళనంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. అనంతరం ఆయన్ను కల్లు తాగాలంటూ పలువురు నాయకులు, నేతలు కోరారు. దీంతో ఒక గ్లాసులో పోసిచ్చిన కల్లును దిగ్విజయ్ సింగ్ తాగారు.

  • Loading...

More Telugu News