: భువనేశ్వరిని నేనేమీ దూషించలేదు: ఎమ్మెల్యే కొడాలి నాని


‘గుడివాడలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన విషయంలో చంద్రబాబు కుటుంబసభ్యుల హస్తం ఉందన్నాను. కానీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై నేను ఎటువంటి విమర్శలు చేయలేదు. దూషించలేదు’ అని గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భువనేశ్వరిని తాను ఇప్పటికీ అమ్మా అని పిలుస్తానని, ఎన్టీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరినీ తాను గౌరవంగా చూస్తానని, ఆ కుటుంబమంటే తనకు ఎనలేని గౌరవమని ఆయన అన్నారు. ఇటీవల గుడివాడ సమీపంలోని ఒక గ్రామానికి భువనేశ్వరి వచ్చిన సందర్భంలో కార్యాలయం విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల హస్తం ఉందని తాను చెప్పడానికి కారణం లేకపోలేదన్నారు. గుడివాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సామాన్లను దౌర్జన్యంగా బయటపడేసిన వారిలో నిమ్మకూరుతో బాటు, మరో గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారన్నారు. అందుకే, తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. 'మా పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన మీరు దానిని ఏమి చేసుకుంటారంటూ' సీఎం చంద్రబాబును నాని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News