: ప్రపంచంలోని ప్రజలందరూ నాకు సమానమే: ఫేస్ బుక్ అధినేత
‘గతంలో కేవలం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే ఫేస్ బుక్ లో ‘సేఫ్టీ చెక్’ ఫీచర్ ను ఉపయోగించాము. అయితే, పారిస్ ఉగ్రవాదుల దాడి సంఘటనతో ఆందోళన చెందిన తాము ఇకపై మానవ బీభత్సాలకు కూడా ‘సేఫ్టీ చెక్’ ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము. ప్రపంచంలోని ప్రజలందరూ నాకు సమానమే. ఫేస్ బుక్ ‘సేఫ్టీ చెక్’ ను ఇకపై మానవ బీభత్సాలకు కూడా వినియోగించాలని నిర్ణయించుకున్నాము’ అని ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. జుకర్ బర్గ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం లెబనాన్ దేశ వాసులే. గతంలో ఆ దేశంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో 40 మంది చనిపోయారు. ఆ సందర్భంలో ఏమాత్రం స్పందించని ఫేస్ బుక్, పారిస్ ఘటన పైనే ఎందుకు స్పందించిందని...ఫేస్ బుక్ లో ‘సేఫ్టీ చెక్’ ఫీచర్ ను ఎందుకు ప్రవేశపెట్టిందంటూ లెబనాన్ తో పాటు పలు వర్గాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో జుకర్ బర్గ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.